RRR నుంచి ‘జనని’ సాంగ్ వచ్చేసింది..! 

 RRR నుంచి ‘జనని’ సాంగ్ వచ్చేసింది..! 

రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ RRR. ఈ మూవీకి సంబంధించిన మరో పాటను రిలీజ్ చేసింది యూనిట్. ఇప్పటికే విడులైన దోస్తి, నాటు నాటు సాంగ్‌లు ఆకట్టుకోగా.. శుక్రవారం వచ్చిన జ‌న‌ని అనే సాంగ్ కూడా బాగుంటుందటున్నారు ఫ్యాన్స్. కీరవాణి సాహిత్యం అందించి ఆలపించారు. ఆద్యంతం భావోద్వేగంతో సాగిన ‘జనని’ పాటలో ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌, శ్రియ ఎక్స్‌ప్రెష‌న్స్ ఉద్వేగ‌భ‌రితంగా ఉన్నాయి. ఈ పాట ఎమోషన్‌ల్ గా ఉందంటున్నారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళం బాషాల్లో ఒకేసారి విడుదల కానుంది.