పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. మాములుగా లేదుగా.. రచ్చ రచ్చే

 పిఠాపురంలో స్టిక్కర్ల వార్.. మాములుగా లేదుగా.. రచ్చ రచ్చే

ఏపీలో ఎన్నికలు అయిపోయినా పొలిటికల్ హీట్ వేవ్ మాత్రం తగ్గడంలేదు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అంటూ పవన్ అభిమానులు బైకులు, ఆటోలు, కార్లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. మనల్నెవడ్రా ఆపేది అనే కొటేషన్స్ తో రచ్చ చేస్తున్నారు. అటు  జనసేన కార్యకర్తలకు ధీటుగా వైసీపీ అభ్యర్థి వంగా గీతా అభిమానులు కూడా స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. 

కాబోయే డిప్యూటీ సీఎం వంగా గీతా అంటూ బైక్ లపై స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. రిజల్ట్స్ కు ముందే పిఠాపురంలో రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీ ఫ్లెక్సీలతో హంగామా చేస్తున్నారు.   ఎన్నికల ఫలితాలకు ముందే అభిమానం పీక్స్‌కు చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది.  ఫలితాలు వెలువడే వరకు ఇరు పార్టీల కార్యకర్తలు మరింత రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  

కాగా  పిఠాపురంలో కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్  బరిలో ఉండగా వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేశారు. అయితే వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ప్రచారం చివరి రోజు సీఎం వైఎస్ జగన్ ప్రకటించడంతో అక్కడి ఫలితం ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.