
ప్రధాని మోడీని 8 ఏళ్ల తర్వాత కలిశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోడీతో పవన్ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. తనకు రెండు రోజుల క్రితం పీఎంవో నుంచి ఫోన్ వచ్చిందని పవన్ తెలిపారు. ఏపీలోని పరిస్థితులను మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. భవిష్యత్లో ఏపీకి మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మోడీతో తాను భేటీ కావడం భవిష్యత్తులో అనేక పరిణామాలకు నాంది పలుకుతుందని వ్యాఖ్యానించారు.
‘‘రెండు రోజుల క్రితం నాకు పీఎంవో నుంచి పిలుపు వచ్చింది. గతంలో చాలాసార్లు ఢిల్లీ వెళ్లినా ప్రధానిని కలవలేదు. 2014లో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయణ్ని కలిశా. ఆ తర్వాత ప్రధానిని ఎప్పుడూ కలవలేదు. ఈ మీటింగ్ ప్రత్యేక పరిస్థితుల్లో జరిగింది. మీటింగ్ వెనుకున్న ముఖ్య ఉద్దేశం.. ప్రధాని ఆకాంక్ష కూడా ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఏపీ అభివృద్ధి చెందాలి’’ అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ప్రధానికి స్వాగతం పలికిన సీఎం జగన్
అంతకుముందు విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ప్రధాని ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా INS చోళ గెస్ట్హౌస్ కు వెళ్లారు. విశాఖలో శనివారం 10,500 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పూర్తయిన మరో రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు.