జనసేన బస్సు యాత్ర వాయిదా

జనసేన బస్సు యాత్ర వాయిదా

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ బస్సుయాత్ర వాయిదా పడింది. జనసేన లీగల్ సెల్ సమావేశంలో పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. అధ్యయనం తర్వాత బస్సు యాత్రను నిర్వహిస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కాగ... అక్టోబర్ లో బస్సు యాత్ర చేయాలని జనసేన మొదట నిర్ణయించింది. అయితే కౌలు రైతుల సమస్యలపై పవన్ చేస్తున్న పర్యటనలు ఇంకా కొన్ని జిల్లాల్లో పూర్తి చేయాల్సి ఉంది.

ఈ పర్యటన పూర్తి చేసిన తర్వాతే.. బస్సుయాత్ర షెడ్యూల్ ప్రకటించాలని నిర్ణయించారు. బస్సుయాత్రలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పార్టీ బలోపేతంపై ఫోకస్ చేయాలని జనసేన భావిస్తోంది. రోజురోజుకు జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45 నుంచి 67 సీట్లు మాత్రమే వస్తాయని సర్వేలో తేలిందని పవన్ పేర్కొన్నారు.