బచ్చన్నపేట(స్టేషన్‌ఘన్‌పూర్), వెలుగు : మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని జనగామ అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్ఆదేశించారు. గురువారం స్టేషన్ఘన్పూర్మున్సిపల్ ఆఫీస్ ను ఆయన సందర్శించి ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ఆఫీసర్లు కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక హైస్కూల్లో పోలింగ్ స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట పలు శాఖల ఆఫీసర్లు ఉన్నారు.
