భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలి  : ఎస్సీఈ దేవేందర్

భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలి  : ఎస్సీఈ దేవేందర్

నల్లబెల్లి, వెలుగు : భగీరథ నీటిని ప్రతి ఇంటికి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ మిషన్​ భగీరథ ఎస్సీఈ దేవేందర్ అధికారులను ఆదేశించారు. గురువారం నల్లబెల్లి పంచాయతీ కార్యాలయంలో భగీరథ నీటి సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించారు.

నీటి సరఫరా మెయిన్​టెన్స్​రిజిస్ర్టర్లు లేకపోవడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామన్నారు.  పంచాయతీ కార్యదర్శి ధర్మేందర్, అధికారులు పాల్గొన్నారు.