భీమదేవరపల్లి, వెలుగు : మాల్దీవులకు చెందిన 35 మంది వివిధ శాఖల అధికారులు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు. ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మాల్దీవుల బృందం సభ్యులు రెండో రోజు గురువారం మండలంలోని ములుకనూర్సొసైటీ, మహిళా స్వకృషి డైయిరీ, డాక్టర్పీవీ రంగరావు బాలికల గురుకుల పాఠశాల, పీవీ స్మృతివనం, ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు.
అనంతరం మహిళా గ్రూప్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు, రైతులు, మహిళాలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాల విద్యార్థుల లైబ్రరీకి రూ.13 వేల విరాళం అందజేశారు. వారి వెంటసర్పంచ్గజ్జెల సృజనారమేశ్, జేడీఎం శ్రీనువాస్, ఎస్బీఎం సంపత్, అధికారులు తదితరులు ఉన్నారు.
