అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్​

అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్​

జనగామ అర్బన్​, వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల పనులను త్వరగా పూర్తిచేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఎంపీపీఎస్ (స్టేషన్) పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసి పనులు పరిశీలించారు. ఈ పనులన్నింటినీ 15 రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోమల్ల పంచాయతీ పరిధిలో 

మిషన్ భగీరథకు సంబంధించి ఎస్డీఎఫ్ కింద చేపడుతున్న పైప్ లైన్ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యాలయంలో రికార్డ్స్ తనిఖీ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో అనిల్ కుమార్, డీఈవో రాము, రఘునాథపల్లి ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జనగామ, వెలుగు: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం ఉచిత శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నదని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్మకంచ ప్రభుత్వ జూనియర్​కాలేజీలో 

షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఎస్సీ నిరుద్యోగ యువతకు శిక్షణ ఏర్పాటు చేశారు.కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డ్​ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి, అధ్యాపకులు, నిర్వాహకులు కవిత, రామనర్సయ్య, అనిల్ తదితర అధికారులు పాల్గొన్నారు.