సెప్టెంబర్ 10న ఓటరు తుది జాబితా : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

సెప్టెంబర్ 10న ఓటరు తుది జాబితా : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10 న ప్రకటించనున్నట్టు జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లో అడిషనల్​ కలెక్టర్​పింకేశ్​ కుమార్, జడ్పీ సీఈవో మాధురి షాతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే అన్ని మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్​ కేంద్రాల జాబితాను ప్రచురించామన్నారు. 

ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపాలని కోరారు. సమావేశంలో డిప్యూటీ సీఈవో సరిత, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.  జనగామ జిల్లాలో కొత్తగా జీపీవోలు విధుల్లో చేరినట్లు కలెక్టర్​ తెలిపారు. జిల్లాలో 129 క్లస్టర్లు ఏర్పాటు చేయగా 129 మందికి పోస్టింగ్​ ఇచ్చామని, వారు తహసీల్దార్​ ఆఫీసుల్లో రిపోర్టు చేశారని చెప్పారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించి ప్రపంచ ఫిజియోథెరపీ డేకు కలెక్టర్​ హాజరయ్యారు. డీఎంహెచ్​వో  మల్లికార్జున్​రావుతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు.