ఇటు చరణ్.. అటు సూర్య.. సౌత్ లో దూసుకుపోతున్న జాన్వీ

ఇటు చరణ్.. అటు సూర్య.. సౌత్ లో దూసుకుపోతున్న జాన్వీ

ఎన్టీఆర్ సినిమా ‘దేవర’తో టాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇస్తోంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.  కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమె గ్రామీణ యువతిగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌‌‌‌ దశలో ఉండగానే మరో తెలుగు సినిమాకు ఆమె సైన్ చేసింది. రామ్ చరణ్‌‌‌‌ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్ర్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చరణ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 16వ చిత్రం. శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్‌‌‌‌ ఎవరనే విషయం ఆసక్తి నెలకొంది.

జాన్వీకపూర్‌‌‌‌‌‌‌‌తో సహా పలువురి పేర్లు తెరపైకొచ్చాయి. ఈ క్రమంలో ఆమె తండ్రి బోనీకపూర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మా అమ్మాయి ఇప్పటికే ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌తో కలిసి ‘దేవర’లో నటిస్తోంది. సెట్‌‌‌‌లో ప్రతి మూమెంట్‌‌‌‌ను ఆమె ఎంజాయ్ చేస్తోంది. త్వరలో రామ్‌‌‌‌ చరణ్‌‌‌‌ సినిమాలోనూ నటించబోతోంది. నటనతో పాటు భాషలో పట్టు సాధించేందుకు వీలు కుదిరినప్పుడల్లా తెలుగు సినిమాలు చూస్తోంది. తన తల్లి ఆశీర్వాదాలు ఆమెకు ఉన్నాయి. సూర్య హీరోగా నటించే హిందీ సినిమాలోనూ ఆమె నటించబోతోంది’ అన్నారు. గత ఆరేళ్లుగా హిందీలో వరుస సినిమాలు చేస్తున్న జాన్వీకి.. చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ఈ క్రమంలో సౌత్‌‌‌‌ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతోంది.