
బాలీవుడ్నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎన్టీఆర్(NTR) తో దేవర(Devara) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తవ్వకముందే..జాన్వీ ముందు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. శ్రీదేవి నటవారసురాలైన జాన్వీని తెరపై చూసుకుని ఆనందించాలని తెలుగు ఆడియాన్స్ వెయిట్ చేస్తున్నారు. దేవరలో జాన్వీ పల్లెటూరి పడుచులా కనిపిస్తోన్న పోస్టర్ రిలీజ్ అయ్యాక..వేయి కళ్ళతో వెయిట్ చేస్తూ..కళ్ళల్లో ఒత్తులేసుకుంటున్నారు ఫ్యాన్స్.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..కుర్ర ఆడియన్స్ కళ్ళలో కన్నీళ్లు తెప్పించేలా జాన్వీ చేయబోతుంది. ఎందుకంటారా? జాన్వీ డైహార్డ్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేని మ్యాటర్ ఒకటి తెలుసుకోవాల్సి ఉంది. జాన్వీ కపూర్కి చిన్ననాటి స్నేహితుడైన శిఖర పహారియా (Shikarpahariya) తో కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. అందులోను పహారియా ఫ్యామిలీతో బోనీ కపూర్ కుటుంబానికి చాలా కాలంగా మంచి సత్సంబంధాలున్నాయి.అలాగే ఈ పెళ్లి వార్తలకు బలమైన కారణాలు కూడా మీడియా కంటికి చిక్కడంతో పెళ్లి రోమర్స్ షురూ అయ్యాయి.
నిన్న (డిసెంబర్5న) ఈ జంట ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ టెంపుల్ని విజిట్ చేశారు. అక్కడ వీరిద్దరూ కలిసి ప్రార్థనలు చేసి ఆరతి- పూజలో జంటగా పాల్గొన్నారు. దీంతో ఇక ఈ జంట త్వరలో ఏడు అడుగులు వేయడానికి సిద్దపడ్డట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట పెళ్లికి రెడీ అవుతోందంటూ పుకార్ మరోసారి సోషల్ మీడియాలో వేడెక్కిస్తోంది. ఇదే విషయంపై ఇరు ఫ్యామిలీస్ స్పందిస్తే తప్ప రూమర్స్కి చెక్ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.