
వరుస సినిమాలతో హీరోయిన్‌గా రాణిస్తున్న జాన్వీకపూర్.. మరోవైపు ఫ్యాషన్ ఐకాన్‌గానూ ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరుగుతున్న హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 (ఐసిడ్యు 2025)లో ఆమె సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి డిజైన్ చేసిన బ్లష్ పింక్ కలర్ లెహంగాలో జాన్వీ చేసిన ర్యాంప్ వాక్ ఆకట్టుకుంది.
ఇందుకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని స్టిల్స్‌లో ఆమె ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలోని శ్రీదేవిని గుర్తుచేస్తోందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా ‘దేవర’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ప్రస్తుతం రామ్ చరణ్‌కు జంటగా ‘పెద్ది’లో నటిస్తోంది. మరోవైపు హిందీలోనూ వరుస సినిమాల్లో నటిస్తోంది.