జన్వాడ ఫామ్ హౌస్ కేస్: విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల సోదాలు

జన్వాడ ఫామ్ హౌస్ కేస్: విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల సోదాలు

హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‎లో సంచలన సృష్టించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్ హౌస్ కేసులో మోకిలా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే జన్వాడ ఫామ్ హౌస్ కేసులో నిందితుడైన విజయ్ మద్దూరి ఇంట్లో మంగవారం (అక్టోబర్ 29) పోలీసులు సోదాలు చేపట్టారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 44 లోని విజయ్ మద్దూరి నివాసంలో గంటకు పైగా మోకిలా పోలీసులు సోదాల తనిఖీలు చేస్తున్నారు. 

ఈ కేసులో కీలకంగా మారిన విజయ్ మద్దూరి మొబైల్ ఫోన్ కోసం పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా, జన్వాడలో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల తన ఫామ్ హౌస్‎లో పార్టీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో డ్రగ్స్, విదేశీ మద్యం సరఫరా జరుగుతోందన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. 

ALSO READ | ఫ్రస్టేషన్‌లో ప్రభుత్వం.. వైఫల్యాలను ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు : KTR

ఈ క్రమంలోనే రాజ్ పాకాల ఇంట్లో పార్టీకి హాజరైన విజయ మద్దూరికి పోలీసులు డ్రగ్ టెస్ట్ చేయగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ ఘటనపై వివిధ సెక్షన్ల కింద మోకిలా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలను ఏ1, విజయ్ మద్దూరిని ఏ2గా పోలీసులు చేర్చారు. ఈ నేపథ్యంలో విజయ్ మద్దూరి నివాసంలో పోలీసులు మంగళవారం తనిఖీలు చేపట్టారు.