భారత్, జపాన్ మధ్య 120 ఒప్పందాలు... ఇరు దేశాల కంపెనీల మధ్య లక్ష కోట్ల పెట్టుబడులకు అంగీకారం..

భారత్, జపాన్ మధ్య 120 ఒప్పందాలు... ఇరు దేశాల కంపెనీల మధ్య లక్ష కోట్ల పెట్టుబడులకు అంగీకారం..
  • డిఫెన్స్​, టెక్నాలజీ, ఆర్థిక, రవాణా రంగాల్లో సహకారానికి నిర్ణయం 
  • ఢిల్లీలో ఇరుదేశాల ప్రధానుల చర్చలు 
  • భారత్ వృద్ధి పథంలో జపాన్ అంతర్భాగం: మోదీ
  • సమస్యల పరిష్కారానికి సంబంధాలు కీలకం: సనే టకాయిచీ

న్యూఢిల్లీ: భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోనున్నట్టు జపాన్ ప్రధాని సనే టకాయిచీ తెలిపారు. రోజురోజుకు సంక్లిష్టమవుతున్న ప్రపంచ వాతావరణాన్ని ఎదుర్కోవడానికి, ఇతర సమస్యల పరిష్కారానికి ఈ సంబంధాలు కీలకమని ఆమె పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలోని హైదరాబాద్​హౌస్​లో 16వ భారత్, -జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇంధనం, సెమీకండక్టర్లు, పటిష్టమైన సప్లై చెయిన్​ను కవర్ చేసే ఆర్థిక భద్రతపై ఇరుపక్షాలు ఒక ఉమ్మడి రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించాయి. 

అలాగే, రక్షణ, సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒక ఉమ్మడి ప్రకటనను జారీ చేయడానికి అంగీకరించాయి. ఈ సమావేశంలో ద్వైపాక్షిక చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనే టకాయిచీ సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇరు దేశాలు వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి, రక్షణ, సాంకేతికత, ఆర్థిక భద్రత, రవాణా రంగాలలో సహకారాన్ని విస్తరించుకోవడానికి అంగీకరించాయని జపాన్ ప్రధాని టకాయిచీ తెలిపారు. ‘జపాన్, భారత్ కలిసికట్టుగా మరింత బలంగా, సుసంపన్నంగా మారడానికి మన బలాలను ఉపయోగించుకోవాలి. 

అంతర్జాతీయ వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్న ఈ తరుణంలో ఇటువంటి పరస్పర సహకార సంబంధాన్ని నెలకొల్పడం మరింత ముఖ్యం’ అని  ఆమె అన్నారు. జపాన్ 'ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ ' విజన్, భారతదేశపు 'మహాసాగర్' చొరవ మధ్య ఉన్న సారూప్యతను టకాయిచీ నొక్కిచెబుతూ, ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి భారత్-, జపాన్ వ్యూహాత్మక సహకారాన్ని మరింత లోతుగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

పెరుగుతున్న వ్యాపార సంబంధాలను హైలైట్ చేస్తూ, ఈ పర్యటనలో భారతీయ, జపాన్ కంపెనీల మధ్య దాదాపు 2 ట్రిలియన్ యెన్ల విలువైన పెట్టుబడులతో కూడిన సుమారు 120 సహకార ఒప్పందాలు ప్రకటించినట్టు టకాయిచీ తెలిపారు. వచ్చే ఏడాది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో, పీఎం మోదీతో కలిసి భారత్-, జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొత్త దశకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు.

10 ట్రిలియన్ యెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల జపాన్ పెట్టుబడులే లక్ష్యం.. 

రాబోయే దశాబ్ద కాలంలో భారతదేశంలో 10 ట్రిలియన్ యెన్ల జపాన్ పెట్టుబడులను సులభతరం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారతదేశ వృద్ధి పథంలో జపాన్ ఒక అంతర్భాగమని ఆయన అభివర్ణించారు. ‘సాంకేతిక భాగస్వామ్యం మన సహకారానికి అత్యంత బలమైన స్తంభంగా మారుతుందని ప్రధానమంత్రి టకాయిచీ, నేను విశ్వసిస్తున్నాము’ అని మోదీ అన్నారు. 

భారత ఏఐ పర్యావరణ వ్యవస్థలోని అనేక కీలక సంస్థలు కూడా ఈ రోజు తమ జపనీస్ భాగస్వాములతో ఒప్పందాలపై సంతకాలు చేశాయని, జపాన్ కచ్చితమైన సాంకేతికత, భారతదేశ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త ఊపును, బలాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నేడు భారతదేశం,  జపాన్  రెండూ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఉన్నాయని, స్వేచ్ఛాయుత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ మన ఉమ్మడి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.

టకాయిచీ నా అందమైన చిట్టి చెల్లి

మూడు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారి భారత పర్యటనకు వచ్చిన టకాయిచీకి ప్రధాని మోదీ సాదరంగా స్వాగతం పలికారు. ఆమె తన అందమైన చిట్టి చెల్లి అని మోదీ అభివర్ణించారు. ‘టకాయిచీ తన తొలి పర్యటన నిమిత్తం భారతదేశానికి విచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 

ఆమె జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి, దార్శనిక, ప్రజాదరణ పొందిన నాయకురాలు. అంతేకాకుండా, ఆమె జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నారా ప్రిఫెక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందినవారు. ఇది భారత్, జపాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల మధ్య ఉన్న ఉమ్మడి బౌద్ధ వారసత్వానికి ఒక కీలక కేంద్రం’ అని ప్రధాని అన్నారు. అలాగే, మోదీ ఆత్మీయ పిలుపుపై టకాయిచీ కూడా సంతోషం వ్యక్తం చేశారు.