జపాన్ అభిమానిని కలిసిన రాంచరణ్

జపాన్ అభిమానిని కలిసిన రాంచరణ్

తమ అభిమాన హీరోలను కలుసుకోవాలని ఎంతో మంది అనుకుంటుంటారు. కానీ.. కొంతమందికి వీలు కాదు. సెల్ఫీ, ఆటోగ్రాఫ్ తీసుకోవాలని తాపత్రయపడుతుంటారు. అలాగే  జపాన్ కు చెందిన ‘నోరికో కాసై’ అనే మహిళ రాంచరణ్ కు అభిమాని. ఈమె ఒక ఆర్టిస్ట్. రాంచరణ్ ను కలవాలని ఎప్పటి నుంచో కలలు కన్నది. ఈ విషయం తెలుసుకున్న రాంచరణ్ ఆమెను కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెతో సరదాగా ముచ్చటించి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా రాంచరణ్ కు ఆమె ఓ చిత్రాన్ని బహుకరించింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. తారక్, చరణ్ నటనకు ప్రశంసలు జల్లు కురిసింది. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఇతర భాషల్లోకి అనువదించి విడుదల చేస్తున్నారు. జపాన్ లో ఇటీవలే విడుదల చేశారు. ప్రస్తుతం రాజమౌళి,రాంచరణ్,ఎన్టీఆర్ లు జపాన్ లోనే ఉన్నారు.