చంద్రుడిపై ల్యాండర్ ను దింపే రేసులోకి జపాన్

చంద్రుడిపై ల్యాండర్ ను దింపే రేసులోకి జపాన్

టోక్యో: చంద్రుడిపై ల్యాండర్ ను దింపే రేసులోకి జపాన్ కూడా ఎంటరైంది. వాతావరణం అనుకూలించక పలుసార్లు వాయిదా పడిన జపాన్ మూన్- ల్యాండర్ మిషన్ 'స్లిమ్'(స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) గురువారం సక్సెస్ ఫుల్ గా ప్రారంభమైంది. తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్ రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్ ను హెచ్2ఏ రాకెట్ విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. 

ఈ ప్రయోగాన్ని  జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ప్రయోగించిన 47 నిమిషాలకే ‘స్లిమ్’ ల్యాండర్.. రాకెట్ నుంచి విడిపోయి భూ-కక్ష్యలోకి చేరిందని జాక్సా వెల్లడించింది. ఇది నాలుగు నుంచి ఆరు నెలల్లో మూన్ పై ల్యాండ్ కానుందని తెలిపింది. జాక్సా తొలి మూన్ ల్యాండింగ్ మిషన్ సక్సెస్ ఫుల్ గా ప్రారంభమవడంపై ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.