టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు

టీచర్ నిర్వాకం..స్కూల్కు 20 లక్షల బిల్లు
  • కరోనా కంట్రోల్​కు జపాన్​లో స్కూల్​ టీచర్​ నిర్వాకం

టోక్యో: కరోనా వైరస్​ పనిపడ్తున్నా అనుకుం టూ ఓ టీచర్​ చేసిన పనికి స్కూల్​ మేనేజ్​మెంట్​కు భారీ మొత్తంలో బిల్లు వచ్చింది. నెలల తరబడి నల్లా విప్పి పెట్టడంతో వేలాది లీటర్ల మంచి నీళ్లు వృథా అయ్యాయి. జపాన్​లోని యొకొసుక సిటీలో ఇది చోటుచేసుకుంది. సిటీలో కిందటేడాది కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. పబ్లిక్​ పార్కులు, స్విమ్మింగ్​ పూల్​లను అధికారులు మూసేశారు. ఆ టైమ్​లో యొకొసుక సిటీలోని ఓ స్కూల్​ టీచర్ ​కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి స్విమ్మింగ్​పూల్​ను నీటితో నింపేసింది. పూల్​లోకి వాటర్​ పంపే నల్లాను ఆన్​ చేసి వదిలేసింది. 
నీళ్లు కంటిన్యూగా పారుతుంటే పూల్​లో కరోనా వైరస్​ నిల్వ ఉండలేదనే నమ్మకంతో ఆమె ఈ పని చేసింది. మధ్యలో స్కూల్​ సిబ్బంది ఎవరైనా గమనించి నల్లా బంద్​ చేసినా.. ఆ వెంటనే మళ్లీ ఆన్​ చేసేది. జూన్​ నెలాఖరు నుంచి సెప్టెంబర్​ దాకా ఈ నల్లా ఆన్​ చేసే ఉంది. ఇట్లా వృధా అయిన నీటితో ఆ స్విమ్మింగ్​ పూల్​ను దాదాపు 11 సార్లు నింపొచ్చని ఎడ్యుకేషన్​  బోర్డ్​ స్థానిక ఉద్యోగి అకీరా కోజిరి చెప్పారు. ఈ నీటి వాడకానికి సంబంధించి స్కూలుకు రూ.20 లక్షల బిల్లు వచ్చింది. ఇందులో సగం సదరు టీచర్, మరో ఇద్దరు సూపర్​వైజర్లతోనే కట్టించాలని లోకల్​ అధికారులు డిమాండ్​ చేశారు. విలువైన మంచినీటిని వృధా చేయడంపై సిటీ అధికారులు మండిపడ్డారు.