
టాలీవుడ్ జక్కన రాజమౌళి(Rajamouli) చెక్కిన అద్భుతమైన వెండితెర సృష్టి ఆర్ఆర్ఆర్(RRR). ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ వరించింది. ఆ రేంజ్ లో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా నిలబెట్టారు దర్శకుడు రాజమౌళి. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
ఇక ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయా పాత్రల్లో ఈ ఇద్దరు నటించారు అనే కంటే జీవించారు అనడం కరక్ట్. ఆ రేంజ్ లో తమ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు ఈ హీరోలు. ఇక తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా అయ్యారు జపనీస్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాస హయషి(Yoshimasa Hayashi). ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు పాటలో తమ డాన్స్ తో ఇరగదీసిన ఇద్దరు యాక్టర్లున్నారు. కానీ వారిలో నా ఫేవరేట్ అంటే జూనియర్ ఎన్టీర్ అని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. నిజమైన గ్లోబల్ స్టార్ అంటే మా ఎన్టీఆర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Japanese Foreign Minister Hayashi Said
— WORLD NTR FANS (@worldNTRfans) July 28, 2023
There Are Two Guys In #RRRMovie But I Prefer Rama Rao Jr @tarak9999 - Most Loved Indian In Japan pic.twitter.com/0sLWXC9MLF