
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పీడ్‌స్టర్ బుమ్రా ఆటపై కీలక అప్‌డేట్ ఇచ్చాడు. కీవీస్‌తో చివరి వన్డే గెలిచిన తర్వాత మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన రోహిత్.. ఆస్ట్రేలియా సిరీస్‌లో బుమ్రా ఆడతాడో లేదో అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
‘ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో బుమ్రా ఆడతాడా లేదా అన్నది ఇప్పుడే క్లారిటీగా చెప్పలేం. చివరి రెండు టెస్ట్‌లకు ఫిట్ అవుతాడనే నమ్మకం ఉంది. ఇలా జరిగితే భారత్ బౌలింగ్ మరింత బలపడుతుంది. అయితే, టీం మేనేజ్మెంట్ మాత్రం బుమ్రాను ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కి రెడీ చేయాలని చూస్తుంది. ఈ విషయంలో బుమ్రాపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని టీం భావిస్తుంది. బుమ్రా ఫిట్‌నెస్ విషయంలో ఫిజియోలతో ఎన్‌సీఏ డాక్టర్లతో రెగ్యులర్ టచ్‌లో ఉన్నాం. బుమ్రా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం’ అని రోహిత్ అన్నాడు.