
టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకోలేదు. పని భారం కారణంగా బుమ్రాకు చివరి టెస్టులో బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. తొలి రోజు తర్వాత బుమ్రాను స్క్వాడ్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. "ఇంగ్లాండ్‌తో జరిగే ఐదవ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు నుండి మిస్టర్ జస్ప్రీత్ బుమ్రాను విడుదల చేశారు".అని బీసీసీఐ శుక్రవారం (ఆగస్టు 1) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సిరీస్ లో మూడు టెస్టులో ఆడతానని చెప్పిన బుమ్రా.. తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. లీడ్స్ లో జరిగిన తొలి టెస్టుతో పాటు లార్డ్స్ లో మూడో టెస్ట్.. మాంచెస్టర్ లో జరిగిన నాలుగో టెస్టుల ఆడాడు.
ఈ సిరీస్ లో రెండో టెస్టుతో పాటు ప్రస్తుతం జరుగుతున్న ఓవల్ టెస్టులో బుమ్రా ఆడలేదు. బుమ్రా ఇంగ్లాండ్ సిరీస్ ముగియడంతో ఇప్పుడు ఏ టోర్నీ ఆడతాడో అనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ఈ స్పీడ్ స్టర్ 2025 ఆసియా కప్ కు అందుబాటులో ఉంటాడు. సెప్టెంబర్ 9 నుంచి ఈ టోర్నీ ప్రారంభమవుతుంది. ఒకవేళ ఆసియా కప్ కు రెస్ట్ కావాలని భావిస్తే అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగుతాడు. ఇదే నెలలో ఆస్ట్రేలియా పర్యటన కూడా ఉంది. ప్రస్తుతం బుమ్రా పరిస్థితి ఎలా ఉందో.. అతనికి ఎంతకాలం రెస్ట్ అవసరమో తెలియాల్సి ఉంది.
►ALSO READ | ZIM vs NZ: పసికూన ఆటగాడు ప్రపంచ రికార్డ్.. 66 ఏళ్ల తర్వాత సీన్ విలియమ్స్ అరుదైన ఘనత
ఈ సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడాడు. లీడ్స్‌లో 43.4 ఓవర్లు బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. బర్మింగ్‌హామ్‌లో రెస్ట్ తీసుకోగా.. అక్కడ సిరాజ్, ఆకాశ్ దీప్ అద్భుతంగా రాణించి ఇండియాకు విజయాన్ని అందించారు. లార్డ్స్‌లో మూడో టెస్టుకు తిరిగి వచ్చిన బుమ్రా 43 ఓవర్లు బౌలింగ్ చేసి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇటీవలే ముగిసిన మాంచెస్టర్ టెస్టులో 33 ఓవర్లలో 112 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. ఓవరాల్ గా 33 ఓవర్లలో 112 పరుగులు ఇచ్చి జెమీ స్మిత్, డాసన్ వికెట్లు తీసుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ కెరీర్ లో 47 టెస్టులాడిన బుమ్రా.. 100కి పైగా పరుగులివ్వడం ఇదే తొలిసారి.
🚨 BCCI CONFIRMS BUMRAH HAS BEEN RELEASED FROM INDIAN TEAM FOR THE 5th TEST. 🇮🇳 pic.twitter.com/H0mfFCSzMq
— Johns. (@CricCrazyJohns) August 1, 2025