IND vs SA: కేప్ టౌన్ టెస్టులో విజయం దిశగా భారత్..రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన సఫారీలు

IND vs SA: కేప్ టౌన్ టెస్టులో విజయం దిశగా భారత్..రెండో ఇన్నింగ్స్ లో కుప్పకూలిన సఫారీలు

కేప్ టౌన్ టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళ్తుంది. ఒకదశలో దక్షిణాఫ్రికాను త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్ ను ముగించాలని భావించిన టీమిండియాకు మార్కరం కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. వీరోచిత సెంచరీతో దక్షిణాఫ్రికా ఆధిక్యం సంపాదించాడు. 103 బంతుల్లో 17 ఫోర్లు, 2సిక్సర్లతో 106 పరుగులు చేసిన ఈ  స్టార్ ఓపెనర్ ఎట్టలకే సిరాజ్ బౌలింగ్ లో రోహిత్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ కు చేరాడు.

మార్కరం ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో సఫారీలు కేవలం 176 పరుగులకే ఆలౌటయ్యారు. మార్కరం తర్వాత ఎల్గర్ చేసిన 12 పరుగులే అత్యధికం. తొలి ఇన్నింగ్స్ లో 55 పరుగులకే కుప్పకూలిన దక్షిణాఫ్రికా భారత్ ముందు 79 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. 3 వికెట్లకు  62 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా భారత పేసర్  బుమ్రా ధాటికి విలవిల్లాడింది. 

తొలి రోజు రెండు వికెట్లు పడగొట్టిన బుమ్రా.. అదే ఫామ్ ను రెండో రోజు కొనసాగించి వికెట్ కీపర్ వెర్రాయిన్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్ వెనక్కి పంపాడు.దీంతో టెస్టుల్లో 9 వ సారి ఈ స్టార్ పేసర్ 5 వికెట్లను తన ఖాతాలో వేసుకోగా.. మ్యాచ్ మొత్తంలో 6 వికెట్లు తీసుకున్నాడు. ముఖేష్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ కృష్ణకు చెరో వికెట్  లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 153 పరుగులకు ఆలౌట్ కావడంతో 98 పరుగుల ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే.