మూవీ అప్డేట్ ఏది..? నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్

మూవీ అప్డేట్ ఏది..? నవీన్ పొలిశెట్టి వీడియో వైరల్

జాతిరత్నాలు మూవీతో  హీరో నవీన్ పొలిశెట్టి సూపర్ హిట్ కొట్టాడు. అతడు ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్లో ‘‘అనగనగ ఒక రాజు’’ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీతో పాటు యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ రాకపోవడంపై తను చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ప్రతీ ఒక్కరూ తన సినిమాల అప్డేట్స్ ఇవ్వమంటూ అడుగుతన్నారని నవీన్ తనపైనే తను పంచ్లు వేసుకున్న తీరు నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఈ వీడియోలో ప్రతిఒక్కరూ నవీన్ ను మూవీ అప్ డేట్స్ గురించి అడుగుతారు. న్యూ ఇయర్ లో న్యూ మూవీస్ అప్డేట్ లని నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్తో అందించబోతున్నానని వీడియో చివరలో స్పష్టం చేశాడు. ఫన్నీ సంభాషణలతో సాగిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.