తెలంగాణలో బస్సుల సంఖ్య పెంచాలి : జావెద్

తెలంగాణలో  బస్సుల సంఖ్య పెంచాలి : జావెద్

ముషీరాబాద్, వెలుగు: సిటీలో బస్సుల సంఖ్య పెంచాలని డీవైఎఫ్ఐ నగర కార్యదర్శి జావెద్ ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. సిటీలో ప్రతి రోజు 40 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో  ప్రయాణిస్తున్నారని.. అందుకు తగినట్లుగా బస్సులు లేవని ఆయన పేర్కొన్నారు.

 మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ప్రతి రోజు బస్సుల్లో వెళ్లే స్టూడెంట్లు, ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య పెరిగిందన్నారు. బస్సుల్లో ఫుల్ రష్​ ఉండటంతో స్టూడెంట్లు ఇబ్బందిపడుతున్నారన్నారు. ఆర్టీసీ అధికారులు స్పందించి బస్సుల సంఖ్యను పెంచాలన్నారు.