
- విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల్లో జనగామ రికార్డ్
- దేశంలోని టాప్ 50 జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో మొదటిది
జనగామ, వెలుగు : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యపు పోటీల్లో దేశంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్50 జిల్లాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జనగామకు చోటు దక్కడంతో కలెక్టర్ ను శభాష్ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. గురువారం సీఎం తన ఎక్స్(ట్విట్టర్) వేదికగా అభినందించారు.
ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అధికారులు పనిచేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడానికి జనగామకు దక్కిన విజయం నిదర్శనమని పేర్కొన్నారు. దీనికి కారణమైన కలెక్టర్రిజ్వాన్బాషా ఆదర్శనీయుడు ప్రశంసించారు. రాష్ట్రంలోని మిగతా జిల్లాల కలెక్టర్లకు జనగామ స్ఫూర్తి కావాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా సాధించిన విద్యా ప్రగతి పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన స్టూడెంట్లను, వారిని తీర్చిదిద్దిన విద్యాశాఖ సిబ్బందిని కూడా ప్రశంసించారు.