
దేశవ్యాప్తంగా 650 జవహర్ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్ ఎంట్రీ)కి సంబంధించి జేఎన్‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు.
అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-–24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతుండాలి.
ప్రవేశ పరీక్ష: జవహర్ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో నాలుగు విభాగాలు(ఇంగ్లీష్, హిందీ, సైన్స్, మ్యాథమెటిక్స్) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ఎగ్జామ్ ఉంటుంది.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎంట్రెన్స్ పరీక్ష 2024 ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు. వివరాలకు www.navodaya.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.