టెర్రరిస్టుల చొరబాటును అడ్డుకొని.. కాల్పుల్లో జవాన్‌‌ మృతి

టెర్రరిస్టుల చొరబాటును అడ్డుకొని.. కాల్పుల్లో జవాన్‌‌ మృతి

శ్రీనగర్‌‌‌‌: దేశంలోకి చొరబడుతున్న టెర్రరిస్టులను అడ్డుకునే ప్రయత్నంలో ఓ ఆర్మీ జవాన్‌‌ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పాక్‌‌ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌(పీఓకే)లోని కుప్వారా జిల్లా తంగ్ధర్‌‌‌‌ సెక్టార్‌‌‌‌లోని గారంగ్‌‌నార్‌‌‌‌ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. ఇందులో ఓ టెర్రరిస్ట్‌‌ కూడా హతమయ్యాడు. శ్రీనగర్‌‌‌‌లోని పీఆర్వో (డిఫెన్స్‌‌) అధికారుల వివరాల ప్రకారం.. గారంగ్‌‌నార్‌‌‌‌ ఎల్‌‌వోసీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ, మన దేశంలోకి ఎంటర్‌‌‌‌ అవుతున్న వ్యక్తులను సోల్జర్లు గుర్తించారు. అడ్డుకోడానికి ప్రయత్నించిన సోల్జర్లపైకి కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో ఓ టెర్రరిస్ట్‌‌ చనిపోయాడు. గాయపడ్డ జవాన్‌‌ను హాస్పిటల్‌‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా, శనివారం తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌‌‌‌ పోలీసులు, ఆర్మీ 29 ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ కలిసి బారాముల్లా జిల్లాలోని క్రీరీ చెక్‌‌ పాయింట్‌‌ వద్ద లష్కరే తాయిబాకు చెందిన ఓ టెర్రరిస్ట్‌‌ను అరెస్ట్‌‌ చేశారు. టెర్రరిస్టుల కదలికల గురించిన సమాచారంతో పోలీసులు, సోల్జర్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. దీంతో లష్కరే తాయిబాకు  చెందిన టెర్రరిస్ట్‌‌ పట్టుబడ్డాడు.