ఈ రోజు నా జీవితంలో సంతోషకరమైన రోజు

V6 Velugu Posted on Apr 08, 2021

తన జీవితంలో ఈ రోజు అత్యంత సంతోషకరమైన  రోజన్నారు మావోల చెర నుంచి విడుదలైన జవాన్ రాకేశ్వర్ సింగ్ భార్య మీను. తన భర్త తప్పకుండా తిరిగి వస్తాడనే నమ్మకం ఉండేదన్నారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలే తెలిపారు మీను. మావోల చెర నుంచి విడుదల కావడంతో జమ్మూ కశ్మీర్ లోని రాకేశ్వర్ సింగ్ కుటుంబ సభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. ఛత్తీస్‌గడ్ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా దొరికిపోయిన రాకేశ్వర్ సింగ్‌ను ఐదు రోజుల తర్వాత మావోలు విడుదల చేశారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా కోబ్రా కమాండెంట్ జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడిచిపెట్టారు. రాకేశ్వర్ సింగ్‌ను బందీగా ఉంచుకొని.. మధ్యవర్తుల పేర్లు చెప్పాలని మావోలు ఛత్తీస్‌గడ్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో సర్కార్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను విడుదలచేశారు. ఈ నెల 3న భద్రతాదళాలు, మావోలకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.. ఈ ఎన్‌కౌంటర్‌లో 22 మంది జవాన్లు, నలుగురు మావోలు కన్నుమూశారు.

Tagged RELEASE, chhattisgarh

More News