ఐసీసీ పదవే లక్ష్యంగా: కీలక పదవులకు రాజీనామా చేయనున్న జైషా

ఐసీసీ పదవే లక్ష్యంగా: కీలక పదవులకు రాజీనామా చేయనున్న జైషా

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ జైషా తన పదవులకు రాజీనామా చేయనున్నాడని తెలుస్తుంది. జైషా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పదవికి పోటీ చేయనున్నారని.. ఈ నేపథ్యంలో తన పదవులకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. నవంబర్ లో ఐసీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది.     

ఇండోనేషియాలోని బాలిలో రాబోయే రెండు రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సాధారణ సమావేశాలు (AGM) జరుగుతాయి.  బుధవారం (జనవరి 31) సమావేశాలు జరుగగనుండగా.. జైషాతో సహా కాంటినెంటల్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో అందరి దృష్టి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శిపై జైషాపైనే ఉంటుంది. ఈ సమావేశంలోనే ఆసియా కప్ 2025 వేదిక ఎక్కడో.. ఏ ఫార్మాట్ లో జరుగుతుందో లాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 

జైషా భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా కుమారుడు. 2019లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) కార్యదర్శి అయ్యాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గాను బాధ్యతలు చేపడుతున్నాడు.