రవికిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు..ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీని నిందిస్తారా?

రవికిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు..ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీని నిందిస్తారా?

సినీ ఇండస్ట్రీలో డ్రగ్స్ దందా జరుగుతుందంటూ యాక్టర్, బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను ఎంపీ జయాబచ్చన్ తిప్పికొట్టారు. ఒకరిద్దరు చేసిన తప్పు వల్ల మొత్తం సినీ ఇండస్ట్రీని తప్పుబట్టడం సరికాదన్నారు.సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే సభలో సినిమా వాళ్లపై చెడుగా మాట్లాడటం దారుణమన్నారు. ఈ విషయం చెప్పేందుకు  తనకు సిగ్గుగా ఉందన్నారు . జీరో అవర్ సందర్భంగా సినీ పరిశ్రమపై కుట్ర జరుగుతుందంటూ నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన జయాబచ్చన్ సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్న వారిలో సినీ ఇండస్ట్రీకి చెందిన వారున్న విషయాన్ని ప్రస్తావించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం మద్దతివ్వాలన్నారు.

దేశంలో డ్రగ్స్ అడిక్షన్ ,అక్రమ రవాణా పెరిగిపోతున్నాయని బీజేపీ ఎంపీ రవికిషన్ సోమవారం లోక్ సభలో ప్రస్తావించారు. యువత భవిషత్తును నాశనం చేయడానికి చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నాయన్నారు.

కన్నీళ్లు మిగిల్చిన ఆ మహా విషాదానికి ఏడాది

అప్పు చెల్లించలేదని కిడ్నాప్ చేసి కొట్టిన హైదరాబాద్ కార్పొరేటర్

భారత్ లో 49 లక్షలు దాటిన కేసులు