వీడియో: గిన్నిస్​ రికార్డులోకి 12 ఏండ్ల  పిల్లాడు.. ఏం చేశాడంటే..

వీడియో: గిన్నిస్​ రికార్డులోకి 12 ఏండ్ల  పిల్లాడు.. ఏం చేశాడంటే..

కొన్నిరకాల పజిల్స్ సాల్వ్ చేయాలంటే మనసంతా వాటి మీదే పెట్టాలి. ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. రూబిక్స్​​ క్యూబ్ కూడా అలాంటి  కష్టమైన పజిలే. కాన్సన్​ట్రేషన్​ మొత్తం క్యూబ్​ మీదే పెట్టినా కూడా సాల్వ్ చేయడం కష్టం. అలాంటిది చెన్నైకి చెందిన  జయదర్శన వెంకటేశన్ అనే12 ఏండ్ల  పిల్లాడు సైకిల్ తొక్కుతూ ఈ పజిల్ క్యూబ్ సాల్వ్​ చేశాడు. బ్యాలెన్స్​ తప్పి సైకిల్​ మీద నుంచి కిందపడకుండా చూసుకుంటూనే, రెండు చేతులతో 14.32 సెకన్లలో రూబిక్స్​​ క్యూబ్​ని సెట్​ చేశాడు.

పోయిన ఏడాది నవంబర్ 28వ తారీఖున ఈ ఫీట్​ చేశాడు జయదర్శన్​. అయితే, ఈమధ్యే అతని వీడియో.. మీడియా, న్యూస్​పేపర్లలో వచ్చింది. దాంతో, సైకిల్​ తొక్కుతూ తక్కువ టైమ్​లో రూబిక్స్​​ క్యూబ్ సాల్వ్ చేసినందుకు  జయదర్శన పేరు గిన్నిస్​ వరల్డ్ రికార్డులో నమోదు చేసింది గిన్నిస్​ సంస్థ. అంతేకాదు తమ ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​లో ఇతని వీడియో పెట్టింది. ఆ వీడియోని ఇప్పటికే ఇన్​స్టాగ్రామ్​లో 60 వేల మందికి పైగా, ట్విట్టర్​లో 30 వేల మందికిపైగా చూశారు. రెండేండ్లుగా రూబిక్స్​​​ క్యూబ్​ని వేగంగా ​సాల్వ్ చేయడం ప్రాక్టీస్​ చేస్తున్నాడు జయదర్శన్​. 

గిన్నిస్​ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయగలననే కాన్ఫిడెన్స్​ వచ్చాక సైకిల్​ తొక్కుతూ ఈ పజిల్​ క్యూబ్​ని సాల్వ్​ చేశాడు. గతంలో ఒంటి చేత్తో 60 రూబిక్స్​​ క్యూబ్​ను 30 నిమిషాల్లో సాల్వ్ చేసి ‘ఆసియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​’లోకి ఎక్కాడు  జయదర్శన్.