
రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, సీవీఎల్ నరసింహారావు ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘జయహో ఇండియన్స్’. ఆర్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. రాజ్ భీమ్ రెడ్డి నిర్మిస్తున్నారు. మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? అనే కాన్సెప్టుతో సినిమా తెరకెక్కుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఆంథమ్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘అడుగే సాగదు, పయనం ఆగదు, గమ్యం తెలియని నా దేశం రా.. అడిగేదెవ్వడు, ఆపేదెవ్వడు సహనం మరిచిన నా దేశంరా’ అంటూ లిరిక్స్ రాశాడు కాసర్ల శ్యామ్. సురేష్ బొబ్బిలి ట్యూన్ చేయగా, యాజిన్ నిజార్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.