సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా బ్రీత్

సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా బ్రీత్

ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ..  బసవతారక రామ క్రియేషన్స్‌‌‌‌ పేరుతో బ్యానర్ స్టార్ట్ చేసి, తన కొడుకు చైతన్యకృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. 

రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం, ఆ తర్వాత చోటు చేసుకున్న ఇన్సిడెంట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఇప్పటివరకూ ప్రపంచం చూడని ఓ కొత్త క్రైమ్ జరుగుతుంది’ అనే డైలాగ్‌‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. యూనిక్ కాన్సెప్ట్‌‌తో తెరకెక్కుతున్న సీట్ ఎడ్జ్  థ్రిల్లర్ ఇదని అర్థమవుతోంది. డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌‌‌‌లో చైతన్యకృష్ణ కనిపించాడు. వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, భద్రమ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.