ముప్ఫయ్యో మూవీని మొదలుపెట్టిన జయం రవి

ముప్ఫయ్యో మూవీని మొదలుపెట్టిన జయం రవి

తమిళ నటుడే అయినా డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు జయం రవి. చైల్డ్ ఆర్టిస్ట్‌‌గా  కెరీర్ మొదలుపెట్టి, ‘జయం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రవి ఇప్పటివరకు ఇరవై ఐదు చిత్రాలు పూర్తి చేశాడు. ప్రస్తుతం ‘పొన్నియిన్ సెల్వన్’తో పాటు మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. రీసెంట్‌‌గా తన ముప్ఫయ్యో మూవీని మొదలుపెట్టాడు. ఎం.రాజేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. హ్యారిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

తెలుగులో గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాలతో మెప్పించి.. డాక్టర్, డాన్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న  ప్రియాంక అరుళ్ మోహన్ ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తోంది. ఎన్.నటరాజన్, వీటీఎన్.గణేష్,  సుబ్రహ్మణ్యం ఇతర​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘జేఆర్ 30’ వర్కింగ్ టైటిల్‌‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఇటీవల ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్  చేసేశారు. వీలైనంత త్వరగా  షూట్ పూర్తి చేసి వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు రవి. అతని గత చిత్రాల్లాగే ఇది కూడా తెలుగులో విడుదల కానుంది.