
ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి, సేనాపతి లాంటి డిఫరెంట్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు పవన్ సాధినేని. తాజాగా జేడీ చక్రవర్తి లీడ్ రోల్‌లో ‘దయా’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించాడు. శ్రీకాంత్ మెహతా, మహేంద్ర సోని నిర్మించారు. గత శుక్రవారం నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతున్న సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘ఈ వెబ్ సిరీస్‌కు వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది.
సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్లు స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి మా వెబ్ సిరీస్ చూస్తున్నారు. జేడీ చక్రవర్తిని ఒకప్పుడు ‘సత్య’ అని పిలిచినట్టు.. ఇప్పుడు ‘దయా’ అని పిలుస్తున్నారు. బెంగాలీ వెబ్ సిరీస్ ‘తక్ ధీర్’ నుంచి ఇన్స్‌పైర్ అయి ఈ కథ రాసుకున్నా. దాని నుంచి కేవలం అంబులెన్స్ డ్రైవర్‌కు డెడ్ బాడీ దొరకడం అనే అంశాన్ని మాత్రమే తీసుకున్నా. మిగతా అంతా నేను రాసుకున్నదే.
జేడీ చక్రవర్తి నటుడే కాదు దర్శకుడు కూడా కావడంతో.. నా వర్క్‌లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో అనుకున్నా. కానీ అలా చేయలేదు. ఆయనకున్న ఎక్స్‌పీరియెన్స్‌కు దర్శకుడి విజన్ తెలుసుకోగలరు. ఇక సీజన్ 1లో చూసిందంతా గ్లింప్స్ లాంటిదే. అసలైన కథ, ట్విస్ట్‌లు సెకండ్ సీజన్‌లో ఉంటాయి. అది డబుల్ స్కేల్‌లో ఉంటుంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైంది. త్వరలోనే సెట్స్‌కి తీసుకెళ్తాం. అలాగే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమాకు సైన్ చేశా’ అని చెప్పాడు.