భారత్, పాక్ యుద్ధంతో మాకే సంబంధం లేదు.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

భారత్, పాక్ యుద్ధంతో  మాకే సంబంధం లేదు..  అమెరికా  వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు

 భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది.  ఇరు దేశాలు డ్రోన్లు, మిసైల్స్ తో ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ,పాకిస్తాన్ మధ్య తాము జోక్యం చేసుకోబోమన్నారు.  జరుగుతున్న పరిణామాలకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని అమెరికా  కోరుకుంటుందన్నారు.

 మేం  చేయగలిగేది ఏమిటంటే  ఉద్రిక్త పరిస్థితులను  ప్రోత్సహించలేం.. మేము యుద్ధం మధ్యలో జోక్యం చేసుకోం.  అది ప్రాథమికంగా మాకు సంబంధించింది కాదు . దానిని నియంత్రించేందుకు  అమెరికాకు  ఎటువంటి సంబంధం లేదు.  భారతీయులను కానీ పాకిస్తానీలను కానీ ఆయుధాలు వదులుకోమని మేము చెప్పలేము. కాబట్టి  మేము దౌత్య మార్గాల ద్వారా ఈ విషయాన్ని కొనసాగిస్తాం అని జేడీ వాన్స్ ఓ ఇంటర్వ్యూలో అన్నారు. 

మరో వైపు పాక్ ప్రధాని  షరీఫ్ కు  యూఎస్ సెక్రటరీ మార్కో రుబియో ఫోన్ చేశారు. ఉద్రిక్తతలు తగ్గించాలని సున్నితంగా హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య చర్చలకు మద్దతిస్తామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రతిదాడులు చేయొద్దని ఆయన పాకిస్తాన్ ను హెచ్చరించారు.

అటు సరిహద్దులో కాల్పులకు తెగబడుతోన్న పాక్ ఆర్మీకి భారత సైన్యం ధీటుగా బదులిస్తోంది. ఇందులో భాగంగా ఎల్ వోసీ వెంబడి ఉన్న పాక్ ఆర్మీ శిబిరాన్ని భారత్ ధ్వంసం చేసింది. మే 8న బుధవారం అర్ధరాత్రి దాటాక.. గురువారం తెల్లవారుజామున పాకిస్తాన్ ప్రయోగించిన 15 మిసైళ్లను మన భద్రతా బలగాలు న్యూట్రలైజ్ చేశాయి. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 సుదర్శన చక్ర డిఫెన్స్ సిస్టమ్, ఇజ్రాయెల్​కు చెందిన హార్పీ డ్రోన్లు ఇందులో కీలక పాత్ర పోషించాయి.  భారత ఉపరితలం నుంచి  పాకిస్తాన్   క్షిపణిF-16 ను కూల్చివేసింది భారత సైన్యం.​