కామేపల్లి మండల కేంద్రంలో .. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పరిశీలన

కామేపల్లి మండల కేంద్రంలో .. ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల పరిశీలన

కామేపల్లి, వెలుగు : మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఖమ్మం జడ్పీ సీఈవో వినోద్ పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్ల పట్ల సంతృప్తి  వ్యక్తం చేశారు. పోలింగ్  పూర్తయ్యే వరకు స్థానిక అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్ పంచాయతీ కార్యదర్శి  పి.అనిల్ కుమార్, ఆర్ ఐ సక్రు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి

కల్లూరు : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్ కోరారు. ఆదివారం కల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కల్లూరు డివిజన్ పరిధిలో ఆరు మండలాల పరిధిలో 17,345 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం కల్లూరు హెడ్ క్వార్టర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డివిజన్ పరిధిలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. 

జూలూరుపాడులో డీఎస్పీ.. 

జూలూరుపాడు : మండల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్​బూత్​లను ఆదివారం కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎస్సై జీవన్ రాజు, పోలీసు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.