బెంగళూరు: బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్ ఇకపై సెక్యులర్ పార్టీ ఎంతమాత్రమూ కాదని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. తాము సెక్యులర్ అని ఆ పార్టీ నేతలు చెప్పుకోకూడదన్నారు. బుధవారం చామరాజనగర్ లోని కోననకెరెలో సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో కుమారస్వామి భేటీ తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జేడీఎస్ నిర్ణయించిందన్నారు. “జేడీఎస్ పేరుకు మాత్రం సెక్యులర్ పార్టీ. బీజేపీతో పొత్తు తర్వాత వారు సెక్యులర్‌గా ఉన్నట్లా? వారు బీజేపీతో వెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరంలేదు. కానీ ఇక నుంచి తాము సెక్యులర్ అని జేడీఎస్ నేతలు చెప్పకూడదు, అంతే” అని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.