తేజస్విని చంపేందుకు జేడీయూ, బీజేపీ కుట్ర ..బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు

తేజస్విని చంపేందుకు జేడీయూ, బీజేపీ కుట్ర ..బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు

పాట్నా: బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ సంచలన ఆరోపణలు చేశారు.  తన కొడుకు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌‌ను చంపేందుకు జేడీయూ, -బీజేపీ కలిసి  కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. శుక్రవారం పాట్నాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గతంలో రెండు, మూడుసార్లు తేజస్విపై దాడులు జరిగాయని, ఒకసారి ట్రక్కుతో గుద్దించే ప్రయత్నం చేశారని చెప్పారు. 

ఇప్పుడు ఎన్నికల ముందు తేజస్విని అడ్డు తొలగించాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో గురువారం తేజస్విపై అధికార పక్షం నేతలు దౌర్జన్యం చేశారని, ఇది కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. సీఎం నితీశ్ కుమార్‌‌కు నల్ల బట్టలు చూస్తే కోపం వస్తోందని, అసెంబ్లీలో తాము ఎలాంటి తప్పు చేయలేదని రబ్రీ చెప్పారు.