న్యూఢిల్లీ: జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లో ‘బాణం’గుర్తుతో పోటీచేయొద్దని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)ని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. జార్ఖండ్‌లోని జేఎంఎం, మహారాష్ట్రకు చెందిన శివసేన పార్టీల గుర్తు ‘ విల్లు-బాణం’. ఈ సింబల్‌కు జేడీయూ గుర్తు ‘బాణం’కు దగ్గర పోలికలున్నందు వల్ల కన్ఫ్యూజన్ అవుతారని జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. జేఎంఎం ఫిర్యాదును పరిశీలించిన ఈసీ … బాణం గుర్తుతో పోటీచేయొద్దని జేడీయూని ఆదేశించింది. ‘ విల్లు-బాణం’ గుర్తును ఆ రెండు రాష్ట్రాల్లో జేఎంఎం, శివసేన ఉపయోగిస్తున్నందువల్ల సొంత సింబల్‌తో పోటీచేయొద్దని జేడీయూని ఈసీ ఆదేశించింది. ఇంతకుముందు గుర్తు విషయంలో జేడీయూకి ఎన్నికల కమిషన్ మినహాయింపుల్ని ఇచ్చింది. ‘విల్లు-బాణం’తో బీహార్‌లో పోటీచేస్తే తమ పార్టీకి నష్టం జరుగుతుందని ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలప్పుడు జేఎఎం, శివసేనలపై జేడీయూ ఈసీకి ఫిర్యాదుచేసింది. దాంతో ‘విల్లు-బాణం’ సింబల్‌తో బీహార్‌లో పోటీచేయొద్దని జేఎఎం, శివసేనను ఈసీ ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ గెలుపుపైనా జేడీయూ గుర్తు ప్రభావం ఉంటుందని జేఎంఎం ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై జేడీయూకి ఆదేశించిన ఈసీ…బీహార్‌లో పోటీచేసే శివసేన, జేఎంఎం కేండిడేట్లు, జార్ఖండ్, మహారాష్ట్రలో పోటీచేసే జేడీయూ అభ్యర్థులు తమ పార్టీ గుర్తులపై కాకుండా ‘ ఫ్రీ గుర్తు’పై పోటీచేయొచ్చని పేర్కొంది.
