JEE మెయిన్ ఫలితాలు విడుదల

JEE మెయిన్ ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి, ఐఐటీ అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత కోసం నిర్వహించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ 2019 ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఢిల్లీ విద్యార్థి శ్రీ వాత్సవ్‌కు జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు వచ్చింది. తొలి 10 ర్యాంకుల్లో ముగ్గురు తెలంగాణ, ఒకరు ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థి ఉన్నారు. రాష్ట్రానికి చెం దిన బెట్టుపాటి కార్తికేయకు మూడో ర్యాంకు, అదేళ్ల సాయి కిరణ్ కు ఏడో ర్యాం కు, కే. విశ్వనాథ్ కు ఎనిమిదో ర్యాంకు వచ్చింది. పేపర్‌ 1లో 100 ఎన్ టీఏ స్కోర్ ను 24 మంది సాధించారు.కేటగిరీల వారీగా కామన్‌ కటాఫ్‌ మార్కు 89.754,ఈడబ్ల్యూఎస్ కు 78.217, ఓబీసీ 74.316, ఎస్సీ 54.012, ఎస్టీ 44.334, పీడబ్ల్యూడీ 0.113గా వెల్లడిం చారు. జేఈఈ మెయి న్ పరీక్షల్లో వచ్చిన ర్యాం కుల ఆధారంగా జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలకు విద్యార్థులను ఎంపిక చేస్తారు. మే 3 నుంచి అడ్వాన్స్ డ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అడ్వాన్స్ డ్ ఫలితాల తర్వాత మెయి న్ 2019 కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఏటా ఒకసారి నిర్వహించే మెయిన్‌ పరీక్షను ఈ సారి రెం డు సార్లు నిర్వహించారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ జనవరి, ఏప్రిల్‌లో నిర్వహించిన మెయిన్ పరీక్షలకు మొత్తంగా 12,37,892 మంది దరఖాస్తు చేసుకోగా 11,47,125 మంది పరీక్షకు హాజరయ్యారు. రెండు సార్లు పరీక్షలు రాసిన 6,08,440 మందిలో 2,97,932 మంది మార్కు లు మెరుగుపరచుకున్నారు. రెం డు పరీక్షల్లోని ఉత్తమ మార్కులను పరిగణలోకి తీసుకొని ర్యాంకులిచ్చింది.