జేఈఈ మెయిన్‌లో అనూహ్య ఫలితాలు

జేఈఈ మెయిన్‌లో అనూహ్య ఫలితాలు

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. టాప్ 20 ఒక్క అమ్మాయి కూడా లేదు. 20 మందికి 100 పర్సంటైల్ రాగా, అందరూ అబ్బాయిలే ఉన్నారు. అమ్మాయిల్లో టాపర్‌‌గా నిలిచిన మీసాల ప్రణతి శ్రీజకు 99.99 పర్సంటైల్ వచ్చింది. సోమవారం రాత్రి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ మేరకు ఫలితాలను విడుదల చేసింది. జేఈఈ మెయిన్–2023 జనవరి సెషన్ ఈ నెల 1న పూర్తి కాగా.. కేవలం ఐదే రోజుల్లో రిజల్ట్ ఇచ్చి రికార్డు సృష్టించింది. టాప్ 20 టాపర్లలో 14 మంది జనరల్ కేటగిరీ, నలుగురు ఓబీసీ, ఈడబ్ల్యూసీలో ఒకరు, ఎస్సీ కేటగిరీలో ఒకరు ఉన్నారు. ‘‘50 మంది అభ్యర్థుల ఫలితాలు పరిశీలనలో ఉన్నందున నిలిపేశాం. ఈ అభ్యర్థుల వివరాలను ప్రత్యేకంగా కమిటీ ముందు ఉంచారు. కమిటీ తన నివేదికను ఖరారు చేసిన తర్వాత వారి స్కోర్‌లు ప్రకటిస్తాం” అని ఎన్‌డీఏ సీనియర్ ఆఫీసర్ తెలిపారు.

విదేశాల్లోనూ 17 కేంద్రాలు

పేపర్ 1లో (బీఈ/బీటెక్) రికార్డు స్థాయిలో 95.80 శాతం (8.23 లక్షల మంది) పరీక్షకు హాజరయ్యారు. ఇక రెండో ఎడిషన్ ఏప్రిల్‌లో జరుగుతుంది. అది పూర్తయ్యాక.. రెండు సెషన్ల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు వెల్లడించనున్నారు. టాప్ 2.6 లక్షల మంది విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్​ డ్​ రాసేందుకు అర్హత పొందుతారు. అడ్వాన్స్ డ్​  అర్హత పొందిన వారు దేశవ్యాప్తంగా ఉన్న 23 ప్రఖ్యాత ఐఐటీల్లో చదివేందుకు అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

100 పర్సంటైల్ సాధించింది వీళ్లే

అభినీత్ మజేటీ, అమోఘ్ జలన్, అపూర్వ సమోట, ఆశిక్ స్టెన్నీ, బిక్కిన అభినవ్ చౌదరి, దేశాంక్ ప్రతాప్ సింగ్, ధృవ్ సంజయ్ జైన్, జ్ఞానేశ్ హేమేంద్ర షిండే, దుగ్గినేని వెంకట యోగేశ్, గుల్షాన్ కుమార్, గుత్తికొండ అభిరాం, కౌశల్ విజయవర్గీయ, క్రిష్ గుప్తా, మయాంక్ సోన్, ఎన్‌కే విశ్వజిత్, నిపున్ గోయల్, కిషి కల్రా, 
సోహమ్ దాస్, సుతర్ హర్షుల్ సంజయ్‌భాయ్, వావిలాల చిద్విలాస్ రెడ్డి.