మిల్లర్ల దోపిడీపై మంత్రి మౌనం ఎందుకు? : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

మిల్లర్ల దోపిడీపై మంత్రి మౌనం ఎందుకు? :  మాజీ మంత్రి జీవన్ రెడ్డి
  •     మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల టౌన్, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో కేజీల కొద్ది కోత విధిస్తూ మిల్లర్లు చేస్తున్న దోపిడీ సహా ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన అన్ని ఆధారాలను సాక్ష్యాలతో సహా బయటపెడుతున్నామని, దీనిపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లాకేంద్రంలోని పార్టీ ఆఫీసులో జడ్పీ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వసంతతో కలిసి మీడియాతో మాట్లాడారు. ధాన్యంలో కోతలు లేవంటూ మంత్రి అడ్లూరి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. 

తాను విక్రయించిన 544 బ్యాగుల ధాన్యాన్ని 218 క్వింటాళ్లుగా తూకం వేస్తే, తనకు ఇచ్చిన ట్రక్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాత్రం 190 క్వింటాళ్లే చూపించారని, అంటే క్వింటాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 5 కేజీల చొప్పున 28 క్వింటాళ్ల ధాన్యం కోత విధించారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మరో రైతుకు 271 క్వింటాళ్లు రావలసి ఉండగా, ట్రక్ షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 250 క్వింటాళ్లే ఇచ్చారని ఆరోపించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2వేల కోట్ల దోపిడీ జరిగిందని, ఈ దోపిడీలో అధికారులకు, నాయకులకు వాటా ఉందో లేదో సమాధానం చెప్పాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ధర్మపురి తహసీల్దార్ సీజ్ చేసిన రూ.30 లక్షల విలువైన 3 వేల ఇసుక డంప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఏమయ్యాయో మంత్రి జవాబు చెప్పాలన్నారు.