కాంగ్రెస్ గెలిచే మొదటి సీటు ధర్మపురి : జీవన్ రెడ్డి

 కాంగ్రెస్ గెలిచే మొదటి సీటు ధర్మపురి : జీవన్ రెడ్డి

జగిత్యాల, వెలుగు :  ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ గెలిచే మొదటి స్థానంగా ధర్మపురి నిలవనుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ధర్మపురి అభ్యర్థి శనివారం నామినేషన్ ​వేయగా.. కాంగ్రెస్​ శ్రేణులు రాయపట్నం నుంచి తహసీల్​ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్ కు నామినేషన్ సమర్పించారు. ర్యాలీలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ​కమీషన్ల కోసమే కాళేశ్వరం నిర్మించి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. 

జగిత్యాల టౌన్, వెలుగు: ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైందని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని 46వ వార్డులో ఇంటింటా ప్రచారం చేశారు అనంతరం స్థానిక ఇందిరా భవన్‌‌‌‌లో విశ్రాంతి ఉద్యోగులతో సమావేశమయ్యారు