
-
ఒకేసారి 62 మందికి పదోన్నతులు
-
హర్షం వ్యక్తం చేసిన వీఏఓఏటీ
హైదరాబాద్, వెలుగు: జెన్కోలో ఒకేసారి 62 మంది అకౌంట్స్ ఆఫీసర్లకు ప్రమోషన్లు కల్పించడంపై విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఏఓఏటీ) హర్షం వ్యక్తం చేసింది. శనివారం విద్యుత్ సౌధలో అకౌంట్స్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ పి. అంజయ్య మాట్లాడారు. కోర్టు కేసులతో సుదీర్ఘకాలంగా ప్రమోషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి ప్రమోషన్లు కల్పించారని చెప్పారు. ఈ సందర్భంగా ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, డైరెక్టర్అజయ్, ఫైనాన్స్డైరెక్టర్అనురాధకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అకౌంట్స్ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు నాసర్ షరీఫ్, శ్యామలరావు, స్వామి, అనురాధ, ప్రసాద్, లొంక అశోక్, వెంకట్, పరమేశ్, శ్రీనివాస్, సిద్ధిరాములు, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.