అమీన్‌పూర్‌లో దారుణం.. కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారుల పైకి ఎక్కించేసిన యువతి

అమీన్‌పూర్‌లో దారుణం.. కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారుల పైకి ఎక్కించేసిన యువతి

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. మహేశ్వరి అనే యువతి  కారు నేర్చుకుంటూ కారు అదుపు తప్పడంతో పిల్లల పైకి ఎక్కించింది. ఇద్దరు పిల్లల పైకి కారుతో యువతి దూసుకెళ్లడంతో పదేళ్ల మణివర్మ అనే పిల్లాడు స్పాట్లోనే చనిపోయాడు. మరో పాప ఏకవాణి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కారు నడిపిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ALSO READ | హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకునేందుకు బారులు తీరిన యువత

ఈ దుర్ఘటనలో చనిపోయిన పిల్లాడిని మణిధర్‌వర్మగా పోలీసులు గుర్తించారు. గ్రౌండ్లో డ్రైవింగ్ నేర్చుకుంటూ నిర్లక్ష్యంగా యువతి కారు నడిపింది. చిన్నారులు గ్రౌండ్లో ఆడుకుంటుండగా వాళ్లపైకి కారు దూసుకెళ్లింది. చనిపోయిన పిల్లాడి తండ్రి శేఖర్ ఫిర్యాదుతో యువతిపై కేసు నమోదు చేశారు. నిందితులు మహేశ్వరి, రవిశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.