లాల్‌ సలామ్​

లాల్‌ సలామ్​

సిల్వర్‌‌ గెలిచిన బింద్యారాణి దేవి
కామన్వెల్త్‌‌లో ఇండియా వెయిట్‌‌లిఫ్టర్ల జోరు 

వయసు పందొమ్మిదేండ్లు. తొలిసారి కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌లో పోటీ పడుతున్నాడు. ఎదురుగా సీనియర్లు, ఫేమస్​ ఆటగాళ్లు ఉన్నారు. ఫైనల్‌‌‌‌ మధ్యలో ఓ కాలు కండరాలు పట్టేశాయి. అయినా అతను వెనక్కి తగ్గలేదు. ఆదివారం జరిగిన వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌ 67 కేజీ కేటగిరీలో బరిలోకి దిగిన ఆ యువకుడు ఏకంగా 300 కిలోలు ఎత్తి పడేశాడు.  కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. అతని పేరు జెరెమీ లాల్‌‌‌‌రినుంగా. మిజోరం నుంచి వచ్చిన లాల్‌‌‌‌రినుంగా తన జోరుతో ఇండియాకు రెండో గోల్డ్‌‌‌‌ అందించాడు.  ఇక,  నిన్న అర్ధరాత్రి విమెన్స్‌‌‌‌ 55 కేజీల ఫైనల్లో బింద్యారాణి దేవి  మొత్తం 202 కిలోల బరువెత్తి సిల్వర్‌‌‌‌ సాధించింది. దాంతో, కామన్వెల్త్‌‌‌‌లో ఇండియా పతకాల సంఖ్య ఐదుకు చేరగా.. అవన్నీ  వెయిట్‌‌‌‌లిఫ్టర్లే సాధించడం విశేషం. 

బర్మింగ్‌‌‌‌‌‌‌హామ్‌‌‌ :  కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్టర్ల పతకాల మోత మోగుతున్నది. ఆదివారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 67 కేజీ ఫైనల్లో 19 ఏండ్ల మిజోరాం కుర్రాడు.. జెరెమీ లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రినుంగా మొత్తం 300 (స్నాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 140+ క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 160) కేజీల బరువు ఎత్తి  గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిశాడు. ఈ క్రమంలో రెండు గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డులను బద్దలుకొట్టాడు. స్నాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి ప్రయత్నంలో 136 కేజీల బరువు ఎత్తిన ఈ యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెండో ప్రయత్నంలో అవలీలగా 140 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 143 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 154, 160 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. మూడో ప్రయత్నంలో 163 కేజీలు ఎత్తలేకపోయాడు. మొత్తానికి 67 కేజీల పోటీల్లో.. స్నాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 140, ఓవరాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా 300 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త రికార్డులు సృష్టించాడు.

క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెరెమీ తొడ కండరాలు బిగుసుకుపోయాయి. దీంతో కాలు తిమ్మిరి ఎక్కడంతో ఒక్కసారిగా ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శిబిరం ఆందోళనకు గురైంది. ‘కండరాలు పట్టేయడంతో నేను ఆందోళనలో పడిపోయా. నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయా. అయినా బ్లైండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వెళ్లి బరువు ఎత్తేశా. నొప్పి ఎక్కువగా ఉండటంతో ఇతర లిఫ్టర్ల వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా పట్టించుకోలేదు. నా లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత నొప్పితో మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తుందా? లేదా? అని కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అరిచేశా. అప్పుడు కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టేశావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అని చెప్పాడు. అంతే నా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి’ అని జెరెమీ వ్యాఖ్యానించాడు.

2018లో యూత్ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెరెమీ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్డ్ కొట్టాలనే లక్ష్యంతో గత నాలుగేళ్లుగా కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్​ మెడల్​ ఫొటోను తన మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నాడు. ఇక జెరెమీ కంటే 7 కేజీలు తక్కువ బరువు ఎత్తిన సమోవా లిఫ్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపావ ఐయానే 293 (127+166) కేజీలతో సిల్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 166 కేజీలు గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు కావడం విశేషం. ఎడిడియోంగ్ ఉమోఫియా (నైజీరియా) 290 (130+160) కేజీలతో బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు. ఇండియాకు ఇది ఐదో మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాగా, వెయిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండో గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 59 కేజీల్లో ఇండియా లిఫ్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాపీ హజారికా ఏడో ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో హజారికా మొత్తం 183 (స్నాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 81+క్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 102) కేజీల బరువు ఎత్తింది. 

భళా.. బింద్యా
శనివారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌ 55 కేజీల ఫైనల్లో బింద్యారాణి దేవి మొత్తం 202 (స్నాచ్‌‌‌‌‌‌‌‌ 86+ క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌ 116) కేజీల బరువు ఎత్తి రెండో స్థానంతో సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకుంది. ఈ క్రమంలో క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్ (116 కేజీ)లో గేమ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డును నమోదు చేసింది. స్నాచ్‌‌‌‌‌‌‌‌లో మూడు ప్రయత్నాల్లో బింద్యారాణి వరుసగా 81, 84, 86 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. జర్క్‌‌‌‌‌‌‌‌ తొలి ప్రయత్నంలో 110 కేజీలు ఎత్తినా.. రెండో ప్రయత్నంలో (114 కేజీ)ఫెయిలైంది. అయితే మూడో ప్రయత్నంలో గేమ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డుతో 116 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేసింది. మణిపూర్​కి చెందిన బింద్యారాణి కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇదే అతిపెద్ద మెడల్‌‌‌‌‌‌‌‌. ఆరంభంలో తైక్వాండో నేర్చుకున్న బింద్యా ఎత్తు తక్కువగా (149 సెం.మీ) ఉండటంతో కోచ్‌‌‌‌‌‌‌‌ల సలహాతో లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌కు మారింది. ఆదిజత్ (నైజీరియా) 203 కేజీ (92+111)లతో స్వర్ణం, ఫ్రారర్‌‌‌‌‌‌‌‌ మోరో (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌) 198 కేజీలలో  బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ నెగ్గారు.

ఇండియా 11.. ఘనా 0
మెన్స్‌‌‌‌ హాకీ జట్టు భారీ విజయంతో కామన్వెల్త్‌‌లో పతక వేటను ప్రారంభించింది. పూల్‌‌–బి తొలి పోరులో గోల్స్‌‌ వర్షం కురిపించిన ఇండియా 11–0 తేడాతో చిన్న జట్టు ఘనాను చిత్తు చేసింది. హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ హ్యాట్రిక్‌‌ గోల్స్‌‌తో విజృంభించగా.. జుగ్‌‌రాజ్‌‌ సింగ్‌‌ రెండు గోల్స్‌‌ కొట్టాడు. మరోవైపు విమెన్స్‌‌ జట్టు రెండో విజయం సొంతం చేసుకుంది. శనివారం రాత్రి జరిగిన పూల్‌‌–ఎలో రెండో మ్యాచ్‌‌లో ఇండియా 3–1తో వేల్స్‌‌ను ఓడించింది. వందనా కటారియా రెండు, గుర్జీత్‌‌ కౌర్‌‌ ఒక గోల్‌‌ చేసింది.