
యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్
న్యూఢిల్లీ : ఎకనమిక్ డేటా పటిష్టంగా వస్తున్న నేపథ్యంలో అమెరికాలో వడ్డీ రేట్లు గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగానే పెరిగానే ఛాన్స్‌లున్నాయని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ మంగళవారం చెప్పారు. వడ్డీ రేటు పెంపుదలలో అవసరమైతే వేగాన్ని కూడా పెంచుతామని స్పష్టం చేశారు. సెనేట్ బ్యాంకింగ్ కమిటీ ముందు జెరోమ్ పొవెల్ మంగళవారంహాజరయ్యారు. జెరోమ్పొవెల్ ప్రకటన అమెరికా స్టాక్ మార్కెట్లపై వెంటనే చూపించింది. ట్రేడింగ్ మొదలైన గంటలోపే ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 0.6 శాతం నష్టపోయింది. పొవెల్ కామెంట్స్‌కి ముందు ఈ ఇండెక్స్ ఒకింత నిలకడగానే ఉంది. కిందటి ఏడాది కాలంలో యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఎనిమిదిసార్లు పెంచింది.
టార్గెట్ 2 శాతం కంటే ఎక్కువగా ఉంటున్న ఇన్ఫ్లేషన్ను కట్టడి చేయడమే ఫెడ్ ముందున్న కర్తవ్యమని పొవెల్ మరోసారి స్పష్టం చేశారు. జనవరిలో కొత్త జాబ్స్ అనూహ్యంగా పెరిగి, అన్ఎంప్లాయ్మెంట్ 50 ఏళ్ల కనిష్టానికి చేరింది. వేతనాల గ్రోత్ నెమ్మదించినప్పటికీ, యూఎస్ ఫెడ్ విధానంలో మార్పులకు అది సరిపోదని ఎనలిస్టులు చెబుతున్నారు. లేబర్ మార్కెట్ పటిష్టంగా ఉంటే ఆదాయాలు పెరుగుతాయి. ఫలితంగా డిమాండ్‌కూడా పుంజుకుంటుంది.
జీతాల పెరుగుదల వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయని, వస్తువులు– సేవల రేట్ల తగ్గింపు క్లిష్టమవుతుందనేది పాలసీమేకర్ల ఆందోళనగా ఎనలిస్టులు పేర్కొంటున్నారు. పొవెల్ బ్యాంకింగ్ కమిటీ హాజరుకు కొంచెం ముందే యూఎస్ సెంట్రల్ బ్యాంక్ సెమి యాన్యువల్ రిపోర్టును రిలీజ్ చేసింది. లేబర్ మార్కెట్టైట్నెస్, కొత్త ఉద్యోగాల జోరు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గడం వంటి డేటా ఈ రిపోర్టులో ఉన్నాయి.