జెట్ ఎయిర్‌వేస్ సీఈవో రాజీనామా

జెట్ ఎయిర్‌వేస్ సీఈవో రాజీనామా

జెట్ ఎయిర్‌వేస్ మరో షాక్ తగిలింది. ఆ సంస్థ డిప్యూటీ సీఈవో, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ ఇవాళ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో తెలిపారు. ఇప్పటికే నష్టాల ఊబిలో ఉన్న జెట్ ఎయిర్ వేస్ దేశీయ, అంతర్జాతీయ రూట్లలో తమ విమానాలను కూడా రద్దు చేసింది. సుమారు 8 వేల కోట్ల అప్పులో ఉన్న సంస్థ తమకు ఎమర్జెన్సీ నిధులు ఇవ్వాలంటూ  ప్రభుత్వాన్ని, ప్రైవేటు సంస్థలను కూడా కోరింది. ఈ పరిస్థితుల్లో అమిత్ అగర్వాల్ రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.