జార్ఖండ్ సీఎం రిపబ్లిక్ డే గిఫ్ట్

జార్ఖండ్ సీఎం రిపబ్లిక్ డే గిఫ్ట్

రాంచీ: పెట్రోల్ ధరల పెరుగుదలతో సతమతమవుతున్న వారికి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఊరటనిచ్చారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు లీటరు పెట్రోల్, డీజిల్ పై రూ.25 చొప్పున సబ్సిడీ ఇచ్చే పథకాన్ని ప్రారంభించారు. సీఎం సపోర్ట్ పెట్రోల్ సబ్సిడీ పథకంగా నామకరణం చేసిన ఈ స్కీం ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. టూవీలర్స్ ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 

పింక్, గ్రీన్ కార్డులు కలిగిన ప్రతి కుటుంబం నెలకు 10 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ పై సబ్సిడీ పొందవచ్చని హేమంత్ సోరెన్ ప్రకటించారు. అయితే పథకం దుర్వినియోగం కాకుండా చూసేందుకు 10లీటర్ల నిబంధన విధించారు. సబ్సిడీగా ఇచ్చే రూ.250ని వినియోగదారుల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ సిస్టం ద్వారా వినియోగదారుల బ్యాంకు అకౌంట్లలో క్రెడిట్ చేయనున్నారు. టూ వీలర్స్ తో పాటు వ్యవసాయ పనుల కోసం పంప్ లు వినియోగించే రైతులకు లబ్ది చేకూరేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఈ స్కీం ద్వారా అనేక కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. గత నెలలోనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ పథకాన్ని ప్రకటించగా.. 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్కీంను అమల్లోకి తెచ్చారు.