
రాంచీ: వెనకబడిన వర్గాల హక్కుల కోసం చేస్తున్న పోరాటాన్ని ఆపబోన ని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అన్నారు. శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. జైలు నుంచి విడుదలయ్యేటప్పుడు తన చేతిపై వేసిన స్టాంప్ ఫొటోను అందులో పంచుకున్నారు. “నేను జైలు నుంచి విడుదలైనప్పుడు అధికారులు నా చేతిపై వేసిన గుర్తు ఇది.
ప్రస్తుతం మన ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది చిహ్నం. ఎలాంటి ఫిర్యాదు, సాక్ష్యం లేకున్నా ఒక సీఎం స్థాయి వ్యక్తిని 150 రోజులు జైల్లో ఉంచారంటే గిరిజనులు, దళితులు, అణగారిన వర్గాల ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారో అర్థం చేసుకోవచ్చు’’ అని హేమంత్ సోరెన్ పేర్కొన్నారు.